బెల్‌వ్యూ అభివృద్ధి చెందేలా సహాయం చేసే పౌర సాంకేతికత పరిష్కారాలను అందించడంలో భాగస్వామ్యం అవడం, ఆవిష్కరించడం వాటిని మెరుగుపర్చడమే Information Technology Department (ITD, సమాచార సాంకేతికత విభాగం) లక్ష్యం.
City Council (నగర్ కౌన్సిల్) విజన్, City of Bellevue (బెల్‌వ్యూ నగర) ప్రధాన విలువలు, అలాగే నగరంలోని వ్యాపార అవసరాలు కింది వ్యూహాత్మక సాంకేతికత ప్రాధాన్యతలకు రూపునిస్తాయి:
- డిజిటల్ బిజినెస్‌ను పెంచడం
- పనివారి ఉత్పాదకతను పెంచడం
- డిజిటల్ సమానత్వం, కలుపుగోలుతనానికి దన్నుగా నిలవడం
- ఆవిష్కరణలను ప్రోత్సహించడం
- సైబర్ రెసీలియన్స్‌ను ఎనేబుల్ చేయడం
బెల్‌వ్యూ నగరం 2024లో Digital Cities Award (డిజిటల్ సిటీస్ అవార్డ్‌లలో) ఐదవ స్థానం సంపాదించింది, గడిచిన ఎనిమిది సంవత్సరాల్లో టాప్ ఫైవ్ నగరాల్లో ఒకటిగా నిలిచింది. అవార్డ్ గెలుపొందిన విభాగం గురించి మరింత సమాచారం తెలుసుకోండి<.
ఆవిష్కరణను ముందుకు తీసుకెళ్లడం
ఆవిష్కరణలు మా సమాజంలో ఒక అంతర్భాగం అనే విజన్‌తో పని చేస్తున్న City Council విజన్‌కు మద్దతుగా బెల్‌వ్యూ Information Technology Department (ITD, సమాచార సాంకేతిక విభాగం) సిటీ హాల్ లోపలా బయటా భాగస్వామ్యాలను వృద్ధి చేస్తుంది.
IT వ్యూహాత్మక ప్రణాళిక
జీవన నాణ్యతను మెరుగుపర్చడం, వాటాదారులతో నిమగ్నం అవడం, మరింత తెలివైన, చురుకైన సేవను అందించడానికి సాంకేతికతను ఉపయోగించడం కోసం బెల్‌వ్యూ తన లక్ష్యాలను ఎలా సాధిస్తుందో ఐదు-సంవత్సరాల పాటు అమలు అయ్యే Enterprise Technology Strategic Plan (ఎంటర్‌ప్రైజ్ సాంకేతిక వ్యూహాత్మక ప్రణాళిక) నిర్దేశిస్తుంది.
ఓపెన్ డేటా
కమ్యూనిటీకి అందించే సేవను మెరుగుపరుస్తూ ఉండడానికి, సమర్థవంతమైన, ప్రభావవంతమైన, నిరంతరం మెరుగైన కస్టమర్ సేవను అందించే కీలక రంగాలకు మద్దతుగా నిలవడానికి బెల్‌వ్యూ పలు రకాల డేటాను సేకరిస్తుంది. మీరు పర్మిట్ సమాచారం, ట్రాఫిక్ మ్యాపులు, ప్రజా భద్రతా గణంకాలు, ఇంకా మరెన్నో అంశాలను తెలుసుకోవడం కోసం ఓపెన్ డేటా పోర్టల్‌లో వెతకండి.